దారుణం : ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు

ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా?

హైదరాబాద్ : మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో దారుణం జరిగింది. తన అక్క కనిపించడం లేదంటూ డిసెంబర్ 17న ఓ వ్యక్తి మలక్ పేట్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. అడ్రస్ , ఇతర వివరాలు తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగించారు. కనిపించకుండా పోయిన మహిళను ఆమె ఇంట్లోనే… చనిపోయిన స్థితిలో గుర్తించారు పోలీసులు. ఇంటి బాత్ రూమ్ లో ఆమె డెడ్ బాడీని గుర్తించి.. పోస్టుమార్టమ్ కు పంపించారు. కేసు దర్యాప్తులో మరిన్ని షాకింగ్ సంగతులు తెల్సుకున్నారు పోలీసులు.

ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే అనుమానం రావడంతో.. పోలీసులు అతడితో అసలు నిజం బయటపెట్టించారు. ఆస్తి విషయంలో గొడవ రావడంతో… తానే అక్కను చంపేశానని ఒప్పుకున్నాడు నిందితుడు. అక్కను చంపి.. బాత్ రూమ్ లో పడేసినట్టుగా పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత… నేరం తనపైకి రావొద్దన్న ఉద్దేశంతో పోలీస్ లకు మిస్సింగ్ అంటూ ఫిర్యాదు ఇచ్చానని వివరించాడు.  పోలీసులు అతడిపై కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు.

చనిపోయిన ఆమె పేరు శివనందిని అని పోలీసులు చెప్పారు. ఆమెను హత్య చేసిన తమ్ముడు సిద్ధార్థ్.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి తండ్రి పేరు మైసయ్య. తల్లి పేరు నిర్మల. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. శివనందినికి ఏడున్నరేళ్ల వయసున్న బాబు ఉన్నాడు.  సిద్ధార్థ్ కు ఇద్దరు పిల్లలు.
ఆస్తి ప్లాట్ల విషయంలో తగాదా నడిచింది. భర్తతో విడాకులు తీసుకుని తల్లిగారింట ఉంటున్న పెద్ద కూతురు శివనందినితో… తల్లి, తమ్ముడికి ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాల తర్వాతే… తోడబుట్టిందని కూడా చూడకుండా తమ్ముడు చంపేశాడని తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates