దారుణం : ఉయ్యాలలో బాలుడ్ని ఎత్తుకెళ్లి చంపేశాయి

BOYకర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాలలో మంగళవారం(ఫిబ్రవరి-20) ఘోరం జరిగింది. కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. ఉసేన్‌ పీరా, చాంద్‌బీ దంపతుల కుమారుడు ఇబ్రహీం (4)ను తీసుకొని వారు వేరుశెనగ నూర్పిడి యంత్ర పనులకు వెళ్లారు.

పొలంలోని కల్లంలో చిన్నారిని ఉయ్యాలలో వేసి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో అటుగా వచ్చిన రెండు కుక్కలు ఆ పిల్లాడిపై దారుణంగా విరుచుకుపడ్డాయి. ఉయ్యాలలో ఉన్న పిల్లాడిని లాక్కెళ్లిన రెండు కుక్కలూ ఆ బాలుడి ముఖాన్నిపీక్కు తిన్నాయి. నూర్పిడి యంత్రం సౌండ్ తో తల్లిదండ్రులకు బాలుడి అరుపులు వినబడలేదు. కొద్దిసేపటి తర్వాత చూసే సరికి పిల్లాడు తీవ్ర గాయాలతో విగతజీవుడిగా మారడం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.

Posted in Uncategorized

Latest Updates