దారుణం : చనిపోయిన 3 నెలలకి అంత్యక్రియలు

నిజామాబాద్ : చనిపోయేముందు ఎక్కడ పుడితే.. అక్కడే పోవాలనుకుంటారేమో అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఎక్కడ మరణించినా అంత్యక్రియలు మాత్రం స్వస్థలంలోనే జరుపుతారు. దేశం కాని దేశం ఐనా.. స్వదేశానికి డెడ్ బాడీని తీసుకొస్తారు. లేదంటే అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. పేదోడు వేరే దేశంలో చనిపోతే డెడ్ బాడీ పుట్టిన ఊరికి చేరాలంటే రూల్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. వాటన్నింటినీ పూర్తి చేసి, ఓ వ్యక్తి మృతదేహానికి పుట్టిన ఊరిలో 3 నెలలకు అంత్యక్రియలు జరిగిన దారుణ సంఘటన మన రాష్ట్రంలోనే జరిగింది.

వివరాల్లోకెళితే.. నిజామాబాద్ లోని నందిపేట్ మండలంలోని లక్కంపల్లి గ్రామానికి చెందిన దేవిదాస్ ((35) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనిచేస్తుండగా మూడు నెలల క్రితం అతడు రెంటుకు ఉండే రూమ్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి, తీవ్రగాయాల పాలై మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే మరణించినప్పట్నుంచీ డెడ్ బాడీని ఇండియాకు తరలించేందుకు ఆ ఫ్యామిలీ నానా కష్టాలు పడింది. పోస్ట్ మార్టం, వీసా తంటాలు. డబ్బులు సరిపడకా ఇలా.. మొత్తంమీద మూడు నెలలు గడిచింది. మొత్తానికి.. ఆయన మృతదేహం ఆదివారం డిసెంబర్-9న స్వగ్రామానికి చేరుకోగా.. కుటుంబీకులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయాడన్న విషయం తెలిసినప్పట్నుంచీ.. దేవిదాస్ ను చివరిసారిగా చూడాలని ఎదురుచూశామని కన్నీరుమున్నీరయ్యారు ఫ్యామీలీ మెంబర్స్.

గదిలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించగా, సిలిండర్‌ కు అంటుకొని అది పేలడంతో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ ప్రమాదంలో మృతిచెందాడని, ఆయనతో పాటు తెలంగాణకు చెందిన మరో వ్యక్తి ఈ ప్రమాదంలో మృతిచెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడు దేవిదాస్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates