దారుణం : చిన్నారికి వాతలు పెట్టిన సవతి తల్లి

హైదరాబాద్ : బిడ్డలపై కన్నతల్లికి ఉండే ప్రేమ సవతి తల్లికి ఉండదని మరోసారి రుజువైంది. నాలుగేళ్ల బాలికను చిత్రహింసలు పెట్టింది. చెప్పిన పని చేయడంలేదని బాలికకు వాతలు పెట్టింది సవతి తల్లి. ఈ సంఘటన హైదరాబాద్, కొండపూర్ లో జరిగింది.

అభంశుభం తెలియని చిన్నారిపై సవతి తల్లి కొన్నిరోజులుగా చిత్రహింసలు పెట్టడమే కాకుండా..సమయానికి తిండి కూడా పెట్టేది కాదట.  చెప్పినట్టు వినలేదని శనివారం గరిటతో వాతలు పెట్టింది. నొప్పి తట్టుకోలేని బాలిక ఏడుస్తూ బయటికి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో..అక్కడికి చేరుకున్న వారు చిన్నారిని కొండాపూర్ స్థానిక హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ చేయించారు. సవతి తల్లిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates