దారుణం : పసికందును ట్రైన్ టాయిలెట్ లో పడేశారు

అమృత్‌ సర్‌:  ఏ తల్లి కన్నదో.. అప్పుడే పుట్టిన మగ శిశువును ట్రైన్ టాయిలెట్ లో పడేసి వెళ్లిపోయారు. గుక్కెడు పాలివ్వలేని ఆర్థిక దైన్యమో లేక అక్రమ సంతానమో తెలియదు గానీ ఆ బిడ్డ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అమృత్‌ సర్‌-హౌరా ఎక్స్‌ ప్రెస్‌ రైలులోని టాయిలెట్ లో గుర్తు తెలియని వ్యక్తులు పొత్తిళ్ల తడి ఆరకముందే శిశువును పడేశారు. ఈ దారుణ సంఘటన ఆదివారం అమృత్ సర్ లో జరిగింది.

అమృత్‌ సర్‌ రైల్వే స్టేషన్‌ లో రైలు ఆగిన సమయంలో టాయిలెట్స్ క్లీన్ చేస్తున్న సిబ్బంది పసికందును గుర్తించారు. టాయిలెట్ రంధ్రంలో మెడ చుట్టూ దుప్పటి కప్పి ఉన్న పసికందును బయటకు తీసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు చిన్నారిని అమృత్‌ సర్‌ ప్రభుత్వ హస్పిటల్ కి తరలించారు. ట్రీమ్ మెంట్ చేసిన డాక్టర్ శిశువుకు ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates