దారుణం.. పోలింగ్ రోజు కాలేజీ సెలవు ఇవ్వలేదని చేతులు కోసుకున్నారు

హైదరాబాద్ : ఎన్నికల వేళ అన్ని ప్రైవేటు, ప్రభుత్వం సంస్థలకు సెలువులు ఇచ్చారని.. తమకు మాత్రం ఇవ్వలేదంటూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులు తీవ్రంగా నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా నాగోల్  బ్రాంచ్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు … తమకు ఔటింగ్ ఇవ్వలేదన్న మనస్తాపంతో చేతులను కోసుకున్నారు. ఆరుగురు విద్యార్థినిలు తమ చేతులు కోసుకోవడంతో.. దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తోంది కాలేజీ యాజమాన్యం. ఎన్నికలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ.. తమకు కనీసం ఒక్కరోజు కూడా ఔటింగ్ ఇవ్వకుండా హాస్టల్ లోనే ఉంచడంపై వారు నిరసన తెలుపుతూ… ఓ వాయిస్ రికార్డ్ చేశారు. తమ కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు ఆ వాయిస్ ను పంపించారు.

Posted in Uncategorized

Latest Updates