దారుణం : యజమానులను చంపి, ప్రొక్లెయినర్ తో పూడ్చిపెట్టాడు

మంగళగిరి: అన్నంపెట్టిన వారినే దారుణంగా చంపేశాడు ఓ డ్రైవర్. యజమానిని, అతడి కొడుకుని చంపి, ప్రొక్లెయిన్ తో పూడ్చి పెట్టాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

మృతులు తెలంగాణలోని నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి చెందిన వేముల లక్ష్మయ్య, వేముల సురేష్‌ గా గుర్తించారు. రాజధాని రోడ్ల నిర్మాణం చేస్తున్న మెఘా కంపెనీకి తమ ప్రొక్లెయినర్‌ ను లక్ష్మయ్య కిరాయికి ఇచ్చారు. పనులు పరిశీలించేందుకు మూడు రోజుల క్రితం తండ్రీకుమారులు వచ్చారు.

వీరు తమ ప్రొక్లెయినర్‌ కు జార్ఖండ్‌ కు చెందిన వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నారు. రెండు రోజులుగా డ్రైవర్‌ ఆచూకీ తెలియడం లేదు. అనుమానంతో ఓ చోట తవ్వించగా మృతుల శవాలు బయటపడ్డాయి. డ్రైవరే ఇద్దరినీ చంపి ప్రొక్లెయినగర్ తో పూడ్చి పెట్టి.. ఆ తర్వాత పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates