దాల్ సరస్సు గడ్డ కట్టింది

మంచుకొండలు,చల్లటి వాతావరణం… కశ్మీర్ లో ఎప్పుడూ ఉండే వాతావరణం. పర్యాటక ప్రాంతమైన కశ్మీర్ ను ప్రస్తుతం చలి వణికిస్తోంది. 11 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిన్న(సోమవారం) రాత్రి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రముఖ పర్యాటక స్థలం దాల్‌ సరస్సుతో పాటు ఇతర సరస్సులు పూర్తిగా గడ్డ కట్టాయి. పైపు లైన్లలో నీళ్లు గడ్డ కట్టడంతో ఇళ్లకు నీటి సరఫరా చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు.

సోమవారం శ్రీనగర్‌లో -6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న సమయాన్ని చిల్లాయి కలాన్ అంటారు. ఈ టైంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 40 రోజుల పాటు ఉండే ఈ వాతావరణం జనవరి 31తో ముగుస్తుంది.

గడ్డ కట్టిన దాల్ సరస్సుపై కొందరు క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates