దినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి

అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కారుపై గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మరో వాహనం ధ్వంసమైంది. దాడి..చెన్నైలోని దినకరన్ ఇంటి ముందే జరిగింది. దాడి సమయంలో దినకరన్ కారులో లేరు..ఆయన కారు డ్రైవర్, వ్యక్తిగత ఫోటోగ్రాఫర్, ఓ ఆటో డ్రైవర్ గాయపడ్డారని సమాచారం. ఈదాడికి పార్టీ మాజీ నేత బుల్లెట్ పరిమళం కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పరిమళంను ఇమధ్యే పార్టీ నుంచి బహిష్కరించారు దినకరన్. దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పరిమళం కోసం గాలిస్తున్నట్టు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates