దివాకర్ ట్రావెల్స్ బొల్తా : 20 మందికి స్వల్ప గాయాలు

diwakarదివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పి పక్కకు దూసుకుపోవడంతో 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. కల్యాణదుర్గం నుంచి అనంతపురానికి వెళ్తున్న బస్సు ఉరవకొండ నియోజకవర్గం, వెలుగుప్ప మండలం కాల్వపల్లి గ్రామం వద్ద రోడ్డుపై నుంచి పక్కకు దూసుకుపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేస్తూ కిందకు దుకారు. దీంతో కొందరికి స్వల్పగాయాలు కాగా… బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాదస్థలిని చేరుకుని పరిశీలించారు. ఇదిలా ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు అదుపు తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే సమయంలో అటుగా వస్తున్న దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సుపై గ్రామస్తులు, ప్రయాణికులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు.

Posted in Uncategorized

Latest Updates