దివాళి ధమాకా ఆఫర్‌ : జియో ఏడాదంతా ఫ్రీ

వరుస పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సంస్థలన్నీ బంపర్‌ డిస్కౌంట్లను, సేల్స్‌ను, ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో కూడా పండుగ ఆఫర్‌ ప్రకటించింది. పండుగ సందర్భంగా స్పెషల్‌ యాన్యువల్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1,699తో రీఛార్జ్‌ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద ఫ్రీగా లోకల్‌, నేషనల్‌ కాల్స్‌, అన్ లిమిటెడ్ రోమింగ్‌, రోజుకు 100  SMSలు, 547.5GB డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ లైవ్‌లోకి తీసుకొచ్చింది. అంతేకాక రూ.100 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌ బ్యాక్‌ను ఇస్తోంది. 1,699 రూపాయల యాన్యువల్‌ ప్లాన్‌పై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందాలంటే 2018 నవంబర్‌ 30 వరకు ఈ స్కీమ్‌లోకి కస్టమర్లు ఎంటర్‌ కావాల్సి ఉంటుంది.

అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ను కూపన్ల రూపంలో కంపెనీ అందిస్తోంది. ఈ కూపన్లను రిలయన్స్‌ డిజిటల్‌ లేదా రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మిని స్టోర్లలో కనీసం రూ.5,000 పైన కొనుగోలు చేస్తే వాడుకోవచ్చు. ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ డ్రైవ్స్‌, షావోమి, శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్లు, శాంసంగ్‌, లెనోవో, సోనీ టాబ్లెట్లను కంపెనీ ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ నుంచి మినహాయించింది. రెండు ఓచర్లను కలిపి, ఒక లావాదేవికి వాడటానికి వీలులేదు. ఈ ఓచర్లు 2018 డిసెంబర్‌ 31కు ఎక్స్‌ పైరీ అయిపోతాయి. అంతేకాక జియో తాజాగా తీసుకొచ్చిన ఈ యాన్యువల్‌ ప్లాన్‌, మరోసారి టెలికాం మార్కెట్‌లో టారిఫ్‌ వార్‌ను సృష్టిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates