దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో బతకాలి : పవన్

PAWANదివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో బతకాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం (ఏప్రిల్-14) హైదరాబాద్ లోని L.B.స్టేడియంలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు పవన్. నాలుగు రోజులపాటు జరగనున్న ఈ టోర్నీలో 24 రాష్ట్రాల నుంచి టీమ్స్ వచ్చాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ కు రూ.ఐదు లక్షలు విరాళంగా ఇచ్చిన పవన్..దివ్వాంగులకు అండగా ఉంటానన్నారు. పోటీలను నిర్వహిస్తున్న బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ను అభినందించారు పవన్ కల్యాణ్.

Posted in Uncategorized

Latest Updates