దీక్షతో క్షీణించిన ఆరోగ్యం : ఢిల్లీ డిప్యూటీ సీఎం హాస్పిటల్ కు తరలింపు

MANIఎనిమిది రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలసి ధర్నా చేస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోగ్యం ఈ రోజు క్షీణించింది. దీంతో అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. ఈ ధర్నాలో కేజ్రీవాల్ తో కలసి కూర్చున్న ఢిల్లీ హెల్త్ మినిస్టర్  ఉన్న మరో మంత్రి సత్యేంద్ర జైన్ ఆఱోగ్యం కూడా క్షీణించడంతో ఆదివారం సాయంత్రం అతన్ని హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రస్తుతానికి సత్యేంద్ర ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం జూన్-13 నుంచి కేజ్రీవాల్, మరో ముగ్గురు మంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బాజిల్ నివాసంలో ధర్నా చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates