దీక్ష విరమించండి : సీఎం రమేష్ కు ఫోన్ చేసిన ఉక్కు శాఖ మంత్రి

BREకడప స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్ష తొమ్మిదోరోజుకు చేరింది. దీంతో ఆ పార్టీ ఎంపీలతా నిరసనలు ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉక్కుమంత్రి బీరేంద్రసింగ్ ఇంటి ముందు ఎంపీలు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. మరోవైపు సీఎం రమేష్ కు ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు బీరేంద్రసింగ్.

కడప స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ టీడీపీ ఎంపీలు. ఢిల్లీలో ఎంపీలంతా సమావేశమయ్యారు. ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఒక ఎంపీ దీక్ష చేస్తుంటే ప్రధాని కానీ, ఉక్కు మంత్రి కానీ పట్టించుకోవటంలేదని ఆరోపించారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే.. విశాఖ ఉక్కు ఉద్యమం లాగా.. మరో పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు.

ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ ఇంటి ముందు ఎంపీలంతా కలిసి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. బీరేంద్రసింగ్, ఉక్కుశాఖ అధికారులతో సమావేశమయ్యారు. కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన డాక్యుమెంట్లను మంత్రికి అందించారు. ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.  ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం రెడీగా ఉందన్నారు బీరేంద్రసింగ్. టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక వచ్చాక ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కు ఫోన్ చేశారు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్. ఆరోగ్యం క్షీణిస్తున్నందున దీక్ష విరమించాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రధాని, ఇతర మంత్రులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక రేపు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ లో మూడు గంటలకు ధర్మపోరాట దీక్ష ప్రారంభం కానుందని చెప్పారు మంత్రి యనమల రామకృష్ణుడు

Posted in Uncategorized

Latest Updates