దీక్ష విరమించిన కేజ్రీవాల్…. గవర్నర్ నివాసం నుంచి బయటకు

KEJRIIఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లో నివాసంలో 9 రోజులుగా చేస్తున్న ధర్నాను విరమించారు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం నుంచి బయటకు వచ్చారు. IAS అధికారులు తిరిగి విధుల్లోకి వచ్చినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ లేఖ రాయడంతో కేజ్రీవాల్ ధర్నాను విరమించినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. మంత్రులు నిర్వహించిన అన్ని సమావేశాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత ఐఏఎస్ అధికారులు హాజరైనట్లు అనిల్ బైజాల్ తన లేఖలో తెలిపారన్నారు. IAS అధికారులందరూ విధులకు హాజరవుతారని అనిల్ బైజాల్ హామీ ఇచ్చారని సిసోడియా తెలిపారు. అయితే  కేజ్రీవాల్‌ తో తన నివాసంలో చర్చలు జరిపేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నిరాకరించారు. సచివాలయంలో చర్చలు జరపడానికి ఆయన ఓకే చెప్పారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులతో కలసి ఈ నెల 11 నుంచి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ధర్నా చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates