దీక్ష విరమించిన సీఎం రమేష్

cm rameshస్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై నేరుగా పోరాడతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ.. ఎంపీ సీఎం రమేష్ దీక్షను శనివారం (జూన్-30) నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు ఏపీ సీఎం చంద్రబాబు. జూన్ 20న సీఎం రమేష్ దీక్షకు దిగారు. 11రోజుల పాటు రమేష్ దీక్షను కొనసాగించారు. దీక్షకు ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.

కడప ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు.. అవసరమైతే ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందన్నారు చంద్రబాబు.

Posted in Uncategorized

Latest Updates