దీనమ్మ జీవితం..! : లెట్రిన్ కోసం రూ.94 లక్షలు

ముంబై : అందమైన ఇంటి కోసం కోట్లు ఖర్చు పెట్టడం తెలుసు. కానీ..ఓ మరుగుదొడ్డి కోసం లక్షలు ఖర్చు పెట్టాడు ఓ వ్యక్తి. చుట్టూ అందమైన సిరామిక్‌ టైల్స్‌ అలంకరణ.. అదిరిపోయే డిజైన్‌.. సౌర శక్తి, హై టెక్నాలజీ వినియోగం..! ముంబైలోని మరైన్‌ డ్రైవ్‌ లో ఎయిర్‌ ఆఫీసుకు ఎదురుగా రూ.94లక్షలతో నిర్మిస్తున్న మరుగుదొడ్డి హంగులివీ.

కస్టమర్ల కోసం వినియోగంలోకి తేనున్న ఈ మరుగుదొడ్డి.. వాక్యూమ్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనికి అవసరమయ్యే కరెంటు మరుగుదొడ్డిపైన ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ద్వారా అందుతుంది. 5 సీట్లున్న ఈ టాయిలెట్‌ లో 2 మహిళలకు కేటాయించారు. ఇటీవల చెప్పుల కోసం కోట్లు ఖర్చుపెట్టిన న్యూస్ వైరల్ కాగా..ఇప్పుడు లెట్రిన్ కోసం ఇన్ని లక్షల పెట్టిన ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది. డబ్బున్న మారాజులు ఏం చేసినా నడుస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Posted in Uncategorized

Latest Updates