దీనికి కూడా ఇస్తారా : గడ్డానికి కోహ్లీ ఇన్సూరెన్స్

KOHసాధారణంగా మనం మన జీవితానికి సంబంధించో, మనం వాడే వస్తువులకు సంబంధించో, వాహనాలకు సంబంధించో ఇన్సూరెన్స్ చేయిస్తుంటాం. అయితే గడ్డానికి కూడా బీమా చేయించడం మనం ఎక్కడా చూసి ఉండం. ఇప్పుడు గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించి అందరినీ ఆశ్యర్యపరిచాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

కొంత కాలంగా కోహ్లి గడ్డంలోనే కనిపిస్తున్నాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా కోహ్లీ గడ్డానికి వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం నా గడ్డాన్ని ఎట్టిపరిస్ధితుల్లో తీయయని కోహ్లీ చెప్పగా, నువ్వు తీయలేవు అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ కూడా చేసింది. కోహ్లీ గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్న వీడియోను తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. ఇన్సూరెన్స్ ఎంతకి చేశారు.. ఏ నిబంధనల కింద చేశారు.. క్లయిమ్ విధానం ఏంటీ అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. ఈ వీడియో చూసిన వారందరూ అసలు గడ్డానికి కూడా ఇన్స్యూరెన్స్ ఇస్తారా అని కామెంట్లు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates