దీపికా, కత్రినా కైఫ్ లకు నేనే కరెక్ట్ : బిగ్ బి

amitabh_final_collageబిగ్ బి అమితాబ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతుంది. ఉద్యోగానికి అప్లయి చేసే ద‌రఖాస్తులా త‌న పూర్తి డీటైల్స్ అన్నీ టైపు చేసి అప్లికేష‌న్ పెట్టుకున్నాడు అమితాబ్‌. అమితాబ్ చేసిన ఈ ట్వీట్‌లో ముందు జాబ్ అప్లికేష‌న్ అని రాసి, ఆ తర్వాత త‌న పేరు: అమితాబ్‌ బచ్చన్‌, పుట్టిన తేదీ: 11.10.1942, అలహాబాద్‌, వయసు: 76 సంవత్సరాలు, అనుభవం: 49 ఏళ్లలో సుమారు 200 చిత్రాల్లో నటించటం, మాట్లాడే భాషలు: హిందీ, ఇంగ్లీష్‌, పంజాబీ, బెంగాలీ, ఎత్తు: 6అడుగుల 2 అంగులాలు. హైట్‌తో మీకు ఎలాంటి సమస్యలు ఉండబోవు అని ఆ ట్వీట్ లో తెలిపారు. అమితాబ్ ఇలా ట్వీట్ చేయడానికి కారణం ఏంటనకుంటున్నారా? బుధవారం( ఫ్రిబ్రవరి14) న ఓ ముంబై న్యూస్ పేపర్ లో బాలీవుడ్ హీరోలు షాహిద్ క‌పూర్‌, అమీర్ ఖాన్‌ల క‌న్నా దీపిక‌, క‌త్రినా కైఫ్‌లు చాలా పొడ‌వు ఉంటార‌ని ఓ క‌థ‌నం ప్ర‌చురితమైంది. ప‌ద్మావ‌తి స‌మ‌యంలో షాహిద్‌తో దీపిక‌కి, థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌లో ఆమీర్‌తో క‌త్రినాకి హైట్ సమ‌స్య‌లు వ‌చ్చాయ‌ని వాటిని క‌వ‌ర్ చేయ‌లేక ఆ చిత్ర ద‌ర్శ‌కులు చాలా ఇబ్బంది ప‌డ్డార‌ని ఆ క‌థ‌నంలో ఉంది. ఆ క‌థనానికి సంబంధించిన క‌టింగ్‌ని బిగ్ బీ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ఠ్ చేస్తూ దీపిక‌, క‌త్రినా క‌న్నా నేను హైట్ ఉంటాను, వారితో న‌టించేందుకు అన్ని అర్హ‌త‌లు త‌నకి ఉన్నాయ‌ని తనదైన స్టైల్ లో చ‌మ‌త్కారంగా ట్వీట్ చేశారు బిగ్ బీ.

Posted in Uncategorized

Latest Updates