దీపిక ఉండేది ఈ బిల్డింగ్ లోనే : 45 అంతస్తుల భీమాండి టవర్స్ లో మంటలు

deepikaముంబై సిటీలో ఒక్కసారిగా కలకలం. బాలీవుడ్ నటులు, పారిశ్రామికవేత్తలు నివాసం ఉంటే వర్లీలోని ప్రభాదేవి ప్రాంతంలో అప్పాసాహేబ్ మరాఠీ మార్గ్ లోని భీమాండ్ స్కై టవర్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. 33 అంతస్తుల ఈ భవంతిలో.. చివరి ఫ్లోర్ లోని ఓ ప్లాట్ నుంచి మంటలు చెలరేగాయి. ఆ వెంటనే కింద ఉన్న రెండు ఫ్లోర్లకు వ్యాపించాయి. ఎమర్జెన్సీగా 10 ఫైర్ ఇంజిన్స్, 5 జంబో ట్యాంకర్స్ స్పాట్ లోకి వచ్చాయి. మంటలను అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఈ బిల్డింగ్ నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే రెండు ప్లాట్లు పూర్తిగా కాలిపోయాయి. మిగతా అంతస్తులు, ప్లాట్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

45 అంతస్తుల భవనం కావటం.. అగ్నిప్రమాదంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో బిల్డింగ్ లో ఉండే వారు అత్యవసర మార్గం, మెట్ల మార్గం ద్వారా కిందకు వస్తున్నారు. ఇప్పటికే 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది. ఈ 33 అంతస్తుల భీమాండి టవర్స్ లో కొన్ని ఆఫీసులు నడుస్తున్నాయి. కొంత మంది నివాసం కూడా ఉంటున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకునే కూడా ఈ బిల్డింగ్ లోనే నివాసం ఉంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates