దుబాయ్ పోలీసులు : శ్రీదేవి కేసు క్లోజ్ చేశాం

Indian-actress-Srideviప్రముఖ సినీనటి శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు క్లోజ్‌ చేశారు.  హోటల్‌ లో శ్రీదేవి మృతిలో ఎలాంటి అనుమానాలేమీ లేవని నిర్ధారించారు. ఆమె మృతి కేసును విచారించిన పబ్లిక్‌ ప్రాసిక్యూషన్ హోటల్‌ గదిలో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందినట్లు తేల్చారు. దీంతో శ్రీదేవి మృతిపై వచ్చిన పలు అనుమానాలు ఊహాగానాలేనని తేలిపోయింది. దీంతో పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అనుమతించింది. పార్థివదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతి పత్రాలను భారత దౌత్య అధికారులకు, కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం శ్రీదేవి పార్థివదేహాన్ని ఎంబాల్మింగ్ కు తరలించారు.

సోమవారమే ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా..ఈ కేసును దుబాయ్ పోలీసులు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వాళ్లు తదుపరి విచారణను పూర్తిచేసి..ఆమె మృతి ప్రమాదవశాత్తూ జరిగినట్లు నిర్ధారించారు.దీంతో కేసును క్లోజ్ చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.

ఆమె పార్థివదేహం అర్థరాత్రి ముంబైకి చేరుకోనుంది. రేపు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates