దుబాయ్ రూల్స్ అంత కఠినమా! : శ్రీదేవి డెడ్ బాడీ ఆలస్యానికి కారణాలు ఇవే

dubaiశ్రీదేవి మృతదేహం ముంబైకి తీసుకురావటానికి ఎందుకు అంత ఆలస్యం అవుతుంది.. 36 గంటలు అయినా ఇంకా దుబాయ్ లోనే ఎందుకు ఉంది.. సూపర్ స్టార్ విషయంలోనూ ఇంత లేటు ఎందుకు అవుతుంది.. ఈ విషయాలే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. వాస్తవానికి నిన్ననే రావాల్సి ఉన్నా.. ఇంత లేట్ కావటానికి కారణం దుబాయ్ రూల్స్. అవును.. అక్కడ ఎవరైనా విదేశీ వ్యక్తులు చనిపోతే ప్రొసీజర్ ప్రకారం అన్నీ జరగాల్సిందే. అది సెలబ్రిటీ అయినా సాధారణ వ్యక్తులు అయినా అందరికీ ఒకటే రూల్స్ ఉంటాయి.

ఫిబ్రవరి 24వ తేదీ అర్థరాత్రి చనిపోయింది శ్రీదేవి. అది కూడా హోటల్ గదిలో. దీంతో విధిగా పోస్ట్ మార్టం చేస్తారు. ఆ రిపోర్ట్ రావటానికి 24 గంటల సమయం తీసుకుంటారు. ప్రస్తుతం శ్రీదేవి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చూద్దాం..

… పోస్టుమార్టం ఇప్పటికే పూర్తి అయ్యింది. రిపోర్ట్ రావటానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న ఆదివారం కావటంతో రిపోర్ట్ రావటం ఆలస్యం అయ్యింది.

… పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని ఎంబాల్మింగ్ చేశారు. ఈ ప్రక్రియ గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది.

… ఆ తర్వాత మాత్రమే డెత్ సర్టిఫికెట్ విడుదల చేశారు. అది పోలీసులకు అందుతుంది.

… దుబాయ్ రూల్స్ ప్రకారం డెత్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇండియన్ ఎంబసీ శ్రీదేవి పాస్ పోర్ట్ రద్దు చేస్తోంది. ఈ సమాచారం దుబాయ్ ఎంబసీకి అందించాల్సి ఉంటుంది.

… పాస్ పోర్ట్ రద్దు చేసిన తర్వాత.. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి తీసుకోవాలి.

… ఇవన్నీ పూర్తయిన తర్వాత దుబాయ్ ఎంబసీ అధికారులు ప్రొసీజర్ కంప్లీట్ చేసి.. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అందజేశారు.

… ఆ వెంటనే ప్రత్యేక చార్టెడ్ ఫ్లయిట్ లో ముంబైకి రానుంది.

ప్రస్తుతం శ్రీదేవి డెడ్ బాడీకి ఎంబాల్మింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. అంటే ఇది రెండు గంటల సమయం పడుతుంది. ఈ తర్వాత ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటుంది. అక్కడి నుంచి ముంబైకి కనీసం మూడు గంటల ప్రయాణ సమయం పడుతుంది. అంటే ఈ సాయంత్రం 4 గంటల సమయానికి ఇండియా రావొచ్చని భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates