దుబాయ్ లాట‌రీలో భార‌తీయుడికి రూ.7 కోట్లు


దుబాయ్‌ లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కువైట్‌లో నివసిస్తున్న సందీప్‌ మీనన్‌ రూ.7 కోట్లు గెలుచుకున్నారు. దుబాయ్‌ డ్యూటీఫ్రీ  సంస్థ నిర్వహించిన ఈ లాటరీలో లాటరీ దక్కించుకుని కోటీశ్వరుడైయ్యాడు. 132వ భారతీయుడిగా మీనన్‌ నిలిచారని ‘ఖలీల్‌ టైమ్స్‌’ తెలిపింది. జీవితంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ గెలుచుకోలేదని తెలిపాడు సందీప్ మీనన్. ఇంత గొప్ప అదృష్టాన్ని కల్పించిన దుబాయ్‌ డ్యూటీఫ్రీ రాఫల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇదే లాటరీలో దుబాయ్‌లో ఉంటున్న 30ఏళ్ల శాంతి బోస్ అనే మరో భార‌తీయుడు బీఎండబ్ల్యూ ఆర్‌9టీ కారును గెలుచుకున్నాడు.

 

Posted in Uncategorized

Latest Updates