దుబాయ్ లో ఏం జరుగుతుంది : శ్రీదేవి మృతిలో చిక్కుముడులు ఇవే

Sridevi-Death-Mystery-Dubhaiదుబాయ్ లో ఏం జరుగుతుంది. శ్రీదేవి మృతిపై ఎందుకు అనుమానాలు బలపడుతున్నాయి. బోనీకపూర్ నిజం చెప్పటం లేదా. పోస్టుమార్టం నివేదికకు – బోనీకపూర్ చెబుతున్న విషయాలకు ఎందుకు పొంతన ఉండటం లేదు. హోటల్ సిబ్బంది చెబుతున్న వివరాలకు – బోనీకపూర్ చెబుతున్న మాటలకు తేడా ఎందుకు వస్తోంది. గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఈ విషయాలపై బోనీకపూర్ ను దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఉదయం కూడా ఆయన విచారణకు హాజరయ్యారు.

చిక్కుముడిగా ఉన్న ప్రశ్నలు ఇవే :

… శ్రీదేవిని అపస్మారక స్థితిలో చూసినప్పుడు ఏం జరిగింది.. ఆమె ఎలా ఉంది. పోలీసులకు ఎప్పుడు ఇన్ఫామ్ చేశారు. ఈ మధ్య ఎంత సమయం ఉంది.. ఈ టైంలో మీరు ఏం చేశారు?

… శ్రీదేవి చనిపోయిన ఖచ్చితమైన సమయం ఎంత?

… బాత్ రూం డోర్ ఎలా ఓపెన్ చేశారు. ఏ విధంగా పగొలగొట్టారు? తలపు పగలగొట్టే సమయంలో మీతో ఎవరు ఉన్నారు? ఎంత మంది సహాయం చేశారు? అసలు మీరు అక్కడ ఉన్నారా లేదా?

… బాత్ రూం డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లినప్పుడు.. బాత్ టబ్ లో నీళ్లు నిండి ఉన్నాయా? నీళ్లు ఎంత పరిమాణంలో ఉన్నాయి?

… శ్రీదేవి తలకు గానీ మరెక్కడైనా శరీరంపై గాయాలు అయ్యాయా.. మీరు చూశారా? పరిశీలించారా?

… పెళ్లి వేడుకలో శ్రీదేవి ఒంటరిగా గడిపారని హోటల్ సిబ్బంది చెబుతోంది. అంటే మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా.. కుటుంబ గొడవలు ఉన్నాయా?

… రాత్రి 10.30 గంటల టైంలో మంచినీళ్లు కావాలని రూం సర్వీస్ కు శ్రీదేవి కాల్ చేసింది. 15 నిమిషాల తర్వాత వాటర్ తీసుకుని వచ్చిన రూం సర్వీస్ వ్యక్తికి రెస్పాన్స్ కాలేదు శ్రీదేవి. డోర్ కొట్టినా ఎందుకు తెరవలేదు. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు ?

( ఇక్కడ కోర్టు మరో క్వశ్చన్ కూడా వేస్తోంది. శ్రీదేవి డోర్ లాక్ చేసుకుని ఉన్నారని హోటల్ సిబ్బంది చెబుతుంటే.. రెండు డోర్లు పగలగొట్టాలి. ఒకటి మెయిన్ డోర్, మరొకటి బాత్ రూం డోర్. మెయిన్ డోర్ ఎవరు ఓపెన్ చేశారు.. కాలింగ్ బెల్ నొక్కినా ఎంత సమయం వరకు ఆమె రెస్పాన్స్ కాలేదు.)

… బాత్ రూం డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లినప్పుడు శ్రీదేవి నాడి కొట్టుకుంటూ ఉందని హోటల్ సిబ్బందిలోని ఓ ఉద్యోగి చెబుతున్నాడు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు.. మీరు డోర్ పగలగొట్టిన వారిలో ఉన్నారా లేదా?

Posted in Uncategorized

Latest Updates