దుబాయ్ లో హిందూ దేవాలయానికి మోడీ శంకుస్ధాపన

templedubaiదుబాయ్ లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.UAEపర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇవాళ (ఆదివారం, ఫిబ్రవరి11) అక్కడి ఓపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ – యూఏఈ మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు మోడీ. ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మోహముద్ బిన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన 30 లక్షల మందికి స్వదేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని మోడీ అన్నారు.

అంతకుముందు అబుదాబి అమర సైనికులకు మోడీ నివాళులర్పించారు. UAE కోసం తమ ప్రాణాలర్పించిన సైనికులకు, UAE నాయకులు, అధికారులతో కలసి నివాళులర్పించారు.

Posted in Uncategorized

Latest Updates