దుబాయ్ షాకింగ్: విచారణ తర్వాతే శ్రీదేవి భౌతికకాయాన్నిఇస్తాం

sssశ్రీదేవి మృతి మిస్టరీగా మారింది. మొదట ఆమె గుండెపోటుతో మరణించారని భావించినా.. ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయిందని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. దీంతో ఈ కేసును దుబాయ్ పోలీసులు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు. వాళ్లు విచారణ మొత్తం పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో భౌతికకాయాన్ని  భారత్‌కు అప్పగించలేమని దుబాయ్‌ అధికారులు  తెలిపారు. ఈ కేసులో మరింత విచారణ అవసరమని దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్ అధికారులు తెలిపారు. దీంతో మృతదేహం చెడిపోకుండా ఎంబాల్మింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రేపు(మంగళవారం,ఫిబ్రవరి-26) మధ్యాహ్నం సోనాపూర్‌లో శ్రీదేవి డెడ్‌బాడికి ఎంబాల్మింగ్ చేయనున్నారు అధికారులు. విచారణ ప్రక్రియ ఆలస్యం కారణంగా రేపు కూడా మృతదేహం అప్పగింత ఉండకపోవచ్చని దుబాయ్ మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో శ్రీదేవి అంత్యక్రియలు రేపు(మంగళవారం-26) ఉండకపోవచ్చని సమాచారం.

కేసు విచారణ పూర్తయ్యే వరకు దుబాయ్‌ విడిచివెళ్లరాదని బోనీకపూర్‌‌కు ప్రాసిక్యూషన్‌ అధికారులు తెలిపినట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates