దుర్గామాత ఆలయంలో హుండీ చోరీ

HUNDI ALEIRయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో  పెద్దవాగు సమీపంలో దుర్గామాత ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం (జూన్-10) రాత్రి హుండీ పగులగొట్టిన దుండగులు డబ్బులు, నగలు దోచుకెళ్లారు. దీనిపై ఆలయ అధికారుల సమాచారంతో పోలీసులు ఆలయ పరిసరాలను పరిశీలించారు. గతంలో కూడా ఆలయంలో చోరీ జరిగింది. వరుస ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

Posted in Uncategorized

Latest Updates