దుష్టులను శిక్షించు స్వామీ : శ్రీవారి చేతిలో స్వర్ణ ఖడ్గం

TTD-KADGAMకలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల్లో నెలవైన స్వామి తిరుమల వేంకటేశ్వరుడి చేతికి స్వర్ణ ఖడ్గం అందింది. బంగారంతో తయారు చేసిన ఈ కత్తి.. మే 29వ తేదీ ఉదయం సుప్రభాతసేవలో ఓ భక్తుడు స్వామి వారికి సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా బోడినాయకలూర్ కు చెందిన వ్యాపారవేత్త తంగదొరై ఉన్నారు. ఆయన శ్రీవారికి పరమ భక్తుడు. తన వ్యాపారం మూడు పువ్వులు – ఆరు కాయలుగా ఉండటంతో స్వామి వారికి మొక్కు చెల్లించుకున్నాడు. రూ.2 కోట్లతో ఆరు కిలోల బంగారంతో స్వర్ణ సూర్య ఖడ్గం చేయించారు. ఇవాళ స్వామి వారికి సమర్పించారు.

శ్రీవారికి ఇలాంటి ఖడ్గం భక్తులు చేయించి ఇవ్వటం ఇది రెండోసారి అంటున్నారు అధికారులు. 1989లో కర్నాటక సీఎంగా ఉన్న వీరేంద్ర పాటిల్ ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇలాంటిది చేయించి ఇచ్చారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇలాంటి బంగారు కత్తి స్వామి చేతికి అందింది. ఈ ఖడ్గంతో దుష్టులను శిక్షిస్తాడని చెబుతున్నారు భక్తులు.

Posted in Uncategorized

Latest Updates