దూసుకెళుతున్నారు : సిటీలో మహిళా డ్రైవర్స్ లక్షన్నర మంది

Women

మహిళ దూసుకెళ్తుంది. మగాళ్లకు పోటీగా వాహనాలు నడుపుతున్నారు. మీ వెనక కూర్చోం.. మేమూ రైడర్స్ అంటున్నారు నేటి మహిళలు. దేశవ్యాప్తంగా చూస్తే.. హైదరాబాద్ లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లయ్ చేస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు లక్షా 50వేల మంది లైసెన్స్ పొందారు. ఈ నాలుగేళ్లలోనే ఈ సంఖ్య మూడింతలు పెరిగినట్లు రికార్డ్స్ చెబుతున్నాయి.

2013 వరకు సిటీ 43వేల285 మంది లైసెన్స్ కలిగి ఉన్న మహిళా డ్రైవర్లు ఉన్నారు. 2017 నాటికి ఈ సంఖ్య 1.45 లక్షలకు చేరుకుంది. వీరందరూ 18 నుంచి 30 ఏళ్ల లోపు మహిళలు కావటం విశేషం. 2015లో 25వేల మంది మహిళలు టూవీలర్, ఫోర్ వీలర్ లైసెన్స్ పొందటంతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు మహిళా రైడర్ల కోసం కంపెనీలు కూడా మేడ్ ఫర్ ఉమెన్ పేరుతో వాహనాలను తీసుకొచ్చాయి. ఒక్క 2016 లోనే 31వేల 058 మంది మహిళలు లైసెన్స్ పొందారు. 2010కు ముందు ఉన్న మహిళా డ్రైవింగ్ లైసెన్స్ లు 2016తో పోల్చి చూసినప్పుడు అందులో సగం కూడా లేవు. ముఖ్యంగా IT, ఆస్పత్రులు, ప్రభుత్వ ఆఫీసుల్లో, కాలేజీల్లో, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ లో ఉద్యోగం చేసే మహిళలే ఎక్కువగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయి చేసుకుంటున్న వారిలో ఉన్నారు. ఏమైనా నేటి మహిళ రైడింగ్ లోనూ దూసుకెళ్తుంది..

Posted in Uncategorized

Latest Updates