దేవదాస్ ఫస్ట్ లుక్ : టైటిల్ చూస్తే లిక్కర్.. పోస్టర్ ఏమో గన్స్

DEVADASఅక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.  ఇప్పడు ఇదే టైటిల్ తో మరో సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దేవదాస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గురువారం (జూలై-5) ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్ట్ చేసిన నాగ్.. మీ అండ్ దాస్ అని ట్విట్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్. మణిశర్మ మ్యూజిక్. దేవ క్యారెక్టర్ లో నాని నటిస్తుండగా.. దాస్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు.

నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఛలో ఫేం రష్మిక మందన నానికి జోడీగా యాక్ట్‌ చేస్తున్నారు. 65 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న దేవదాస్  సెప్టెంబర్‌ లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దేవదాస్ అనే టైటిల్ గుర్తుకు వస్తేనే చాలు మందు సీసాలు గుర్తుకొస్తాయి.. అలాంటిది 2018 దేవదాస్ టైటిల్ పోస్టర్ లో మాత్రం తుపాకులు, బుల్లెట్లు ఉండటం చూస్తుంటే.. మూవీ వైవిధ్యంగా ఉంటుందని అర్థం అయిపోతుంది.

Posted in Uncategorized

Latest Updates