దేవుడా ఏంటిది : తిరుమల కొండపై ఉద్యోగుల నిరసనలు

TTDతిరుమల కొండపై TTD , కొంతమంది అర్చకుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు నిరసనగా TTD ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలతో గురువారం (మే-24)  విధులకు హాజరయ్యారు. TTD ప్రతిష్టను దిగజార్చేలా రమణదీక్షితులు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవంతో పాటు… భక్తుల మనోభావాలను దెబ్బతింటున్నాయని TTD ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.  మూడు రోజుల వరకు ఉద్యోగులంతా నల్లబ్యాడ్జిలతో శాంతియుత  నిరసన తెలుపుతామన్నారు. భవిష్యత్ లో ఎవరూ TTD పై ఇలాంటి ఆరోపణలు చేయకుండా దేవస్థానం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీవారి ఆలయంలో ఉద్యోగుల నిరసనలను తప్పుబట్టారు బీజేపీ నేతలు. స్వామివారి ఆలయంలో ఇలా నిరసనలు తెలపడం కరెక్ట్ కాదన్నారు. సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలపడం బాధ కలింగించిందన్నారు సినీ నటి కవిత. ఆలయంలో TTD ఉద్యోగులు అత్యుత్సాహం  చూపిస్తున్నారని మండిపడ్డారు బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి. దేవుడి సన్నిధిలో నిరసనలు చేయరాదన్నారు. రమణ దీక్షితులు ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే కమిషన్ వేసి విచారణ చేయాలన్నారు.

Latest Updates