దేవుడా.. చెప్పింది ఎవరో తెలుసా : విజయ్ మాల్యా అప్పు గురించి తెలియదు

vijay-mallya_650x400_81457535262బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా అప్పులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ దగ్గర లేవని కేంద్ర సమాచార కమిషన్‌ (CIC)కి కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మాల్యా అప్పులకు సంబంధించి వివరాలు కావాలంటూ రాజీవ్‌ కుమార్‌ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలు తాము ఇవ్వలేమని, వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా RTI చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయంటూ ఆర్ధిక శాఖ తెలిపింది.

ఆర్థిక శాఖ వైఖరితో షాక్ అయిన రాజీవ్.. సమాచార హక్కు కమిషన్ ను ఆశ్రయించారు. కమిషన్.. ఆర్థికశాఖను వివరాల కోరింది. మళ్లీ అదే సమాధానాన్ని కమిషన్ కు చెప్పింది.  మాల్యా అప్పులకు సంబంధించిన రికార్డులేవీ తమ దగ్గర లేవని, దరఖాస్తుదారుడు కోరుతున్న సమాచారం ఆయా బ్యాంకులు లేదా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర ఉండొచ్చని చెప్పింది. ఆర్థికశాఖ సమాధానంపై సమాచార హక్కు కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టప్రకారం ఇది అస్పష్టమైన, అస్థిరమైన జవాబు అంటూ నిరసన వ్యక్తం చేసింది. రాజీవ్‌ దరఖాస్తును సంబంధిత పబ్లిక్‌ అథారిటీకి బదిలీ చేయాలని సూచించింది.

Posted in Uncategorized

Latest Updates