దేవుడి దగ్గరకు పంపింది : 20 మంది వృద్ద పేషెంట్లును చంపిన నర్సు

ప్రాణాంతకమైన రసాయనాలను సూదుల ద్వారా వృద్ద పేషెంట్ల శరీరంలోకి ఎక్కించి 20 మంది మృతికి కారణమైన కేసులో ఓ నర్సుని పోలీసులు అరెస్ట్ చేశారు. జపాన్ లో ఈ ఘటన జరిగింది.

సబర్బన్ టోక్యోలోని ఓ హాస్పిటల్ లో 2016లో ఓ 88 ఏళ్ల వృద్దుడి చావుకి కారణమైన కేసులో అయూమి కుబోకి(31) అనే మహిళా నర్సుని శనివారం అరెస్ట్ చేసినట్లు టోక్యో పోలీసులు బుధవారం(జులై-11)  తెలిపారు. అయితే ఇప్పటివరకూ 20 మందిని చంపినట్లు ఆ మహిళ పోలీసులు విచారణలో ఒప్పుకున్నట్లు స్ధానిక మీడియా రిపోర్ట్ చేసింది. చావుబతుకుల్లో ఉన్న పేషెంట్ల టైమ్ ని కంట్రోల్ చేయడానికే తాను ప్రయత్నించానని, ఆ సమయంలో 20 మంది చనిపోయినట్లు ఆమె విచారణలో తెలిపింది. 2016లో వృద్దుడుని చంపిన తర్వాత నుంచి నిందితురాలు నర్సుగా పనిచేయట్లేదని పోలీసులు తెలిపారు. అసలు నర్సు ఇదంతా ఎందుకు చేసిందనే దానిపై విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates