దేవుడు అన్యాయం చేశాడు : చిరంజీవి

chiru-and-sreedeviచిన్న వయసులోనే శ్రీదేవిని తీసుకెళ్లి.. భగవంతుడు అన్యాయం చేశారన్నారు చిరంజీవి. ఆమె నటన కోసమే పుట్టారని, ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నామన్నారు. శ్రీదేవి మృతితో సినీ ఇండస్ట్రీ ఓ గొప్ప నటిని కోల్పోయిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలన్నారు చిరంజీవి. మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.

జగదేక వీరుడు – అతిలోక సుందరి సినిమాలో నటించిన శ్రీదేవి.. ఆ పాత్ర కోసమే పుట్టిందా అన్నట్లు మెప్పించిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాల పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా మా కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. నా 60వ పుట్టినరోజు ఫంక్షన్ కు శ్రీదేవి దంపతులు రావటం మర్చిపోలేనన్నారు. ఆమెను ఇంత త్వరగా దేవుడు తీసుకెళతాడు అని అనుకోలేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates