దేవుడు బతికిస్తాడని..ఇంట్లోనే ఐదు రోజులుగా శవం

deathమరణించిన వ్యక్తిని దేవుడే రక్షిస్తాడని ఐదు రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టిన దారుణ సంఘటన ఏపీలోని వెస్ట్ గోదావవరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జంగారెడ్డిగూడెంకి చెందిన అరుణజ్యోతి(41) ఓ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే మరణించి ఐదు రోజులైనా శవాన్ని ఇంట్లోనే పెట్టుకోవడంతో..దుర్వాసన బరించలేని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఊహించని నిజాలు బయటపడ్డాయి. తన కూతురు చనిపోలేదని, నిద్రపోతుందంటూ తల్లీ, కొడుకు పోలీసులపై నానా రచ్చ చేశారు. మృతిరాలి తమ్ముడు అయితే శవం పక్కనే అన్నం తినడం చూసిన పోలీసులు అవాక్కయ్యారు.

వివరాల్లోకెళితే..

కుటుంబ కలహాలతో  జీలుగుమిల్లికి  చెందిన మంజులాదేవి (70), ఆమె కుమారుడు రవిచంద్ర(39), కుమార్తె అరుణజ్యోతి(41)లు జంగారెడ్డిగూడెంలోని మేఘన టవర్స్‌ ఫస్ట్ ఫ్లోర్ లో రెంటుకు ఉంటున్నారు.  కొంత కాలంగా తమ ఆస్తులకు సంబంధించి తగాదాలు జరుగుతుండటంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. దీంతో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడిని తీసుకువచ్చి ముగ్గురు ఒకే దగ్గర ఉంటున్నారు. అయిదు నెలలుగా రెంటు, కరెంటు బిల్లు కూడా చెల్లించడం లేదని అపార్ట్‌ మెంట్‌ వాసులు తెలిపారు. అరుణజ్యోతి  ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా.. లేకుంటే ఆకలితో అలమటించి చనిపోయిందా..అనేది తేలాల్సి ఉంది. మృతి చెందిన అరుణజ్యోతి అయిదు రోజులుగా ఇంట్లోనే శవంగా పడి ఉంది.

తల్లి, కుమారుడికి కూడా మతి స్థిమితం సరిగ్గా లేకపోవడంతో శవం పక్కనే కూర్చుని రవిచంద్ర భోజనం చేస్తున్నాడు. తమ కుమార్తె చనిపోలేదని, నిద్రపోతుందని పోలీసులపై విరుచుకుపడ్డారు. చనిపోతే దేవుడు బతికిస్తాడు అని ఎవ్వరికి తన కుమార్తెను ఇవ్వమని వెళ్లిపోవాలంటూ పోలీసులపై కేకలు వేశారు. డాక్లర్లు వచ్చి చెబితే తప్ప నమ్మం అంటూ సోదరుడు రవిచంద్ర అనడంతో పోలీసులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి, బలవంతంగా శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో  స్థానిక VRO  నుంచి ఫిర్యాదు తీసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తామని తెలిపారు పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates