దేవుని పై ఐన్ స్టీన్ అభిప్రాయం ఇదే

ఆధునిక భౌతికశాస్త్రాన్ని కొంత పుంతలు తొక్కించిన శాస్త్రవేత్త ఐన్ స్టీన్. వీరి కాలంలో భౌతికశాస్త్రం ఎంతో ముందుకు వెళ్లింది. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఐన్ స్టీన్ ప్రతిపాదించారు. వీరు చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు మతం, దేవుని పై తన అభిప్రాయాన్ని ఓ లెటర్ ద్వారా తెలిపారు. ఈ ఉత్తరం ‘గాడ్‌ లెటర్‌’ గా ప్రసిద్ధి.  అమెరికాలో క్రిస్టీస్‌ సంస్థ ఆ ఉత్తరాన్ని వేలం వేసింది. ఇందుకు.. 2.89మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.20కోట్లు) పలికింది. ఐన్ స్టీన్ లేఖకు 1.5మిలియన్‌ డాలర్లు పలుకుతుందని క్రిస్టీస్‌  సంస్థ వాళ్లు అంచనా వేశారు. కానీ అంచనాలను మించిన ధర పలకడం సంతోషంగా ఉందని తెలిపారు.

జనవరి 3 వ తారీకు 1954 వ సంవత్సరంలో దేవునిపై తన అభిప్రాయాన్ని ఉత్తరం ద్వారా తెలిపారు. దానిని  జర్మన్‌ ఫిలాసర్‌ ఎరిక్‌ గుట్‌కైండ్‌కు పంపించారు. ఎరిక్‌ తాను రాసిన ‘చూజ్‌ లైఫ్‌: ద బిబ్లికల్‌ కాల్ టూ రివోల్ట్‌’ పుస్తకాన్ని ఐన్‌స్టీన్‌కు పంపించగా తర్వాత ఐన్‌స్టీన్‌ ఆయనకు దేవుడు, మతం గురించి తన ఆలోచనలు వివరిస్తూ లెటర్ రాసి పంపారు. తనకు సంబంధించి.. దేవుడు అనేది మనుషుల వ్యక్తీకరణ అని.. మానవుల బలహీనతే దేవునిగా రూపాంతరం చెందిందని ఐన్ స్టీన్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates