దేశంలోని ప్రతి అంగుళాన్ని అభివృద్ది చేస్తాం: మోడీ

modi
కులమతాలకు  సంబంధం లేకుండా  దేశంలోని  ప్రతి అంగుళాన్ని  అభివృద్ది చేయాలనే  సంకల్పంతో పనిచేస్తున్నామని  చెప్పారు  ప్రదానమంత్రి నరేంద్రమోడీ.  ఉత్తర్ ప్రదేశ్ లోని …మఘర్ లో  సంత్  కబీర్ సమాధిని  సందర్శించారు.  వర్దంతి  సందర్భంగా… సద్గురు  కబీర్ అకాడమీకి  పునాదిరాయి వేశారు.  కలహాలు, అశాంతిని  రగిల్చి  రాజకీయ లాభం  పొందేందుకు  కొందరు ప్రయత్నిస్తున్నారని .. వారిని కూకటివేళ్లతో  పెకిలిస్తామన్నారు.  కబీర్, గాంధీ,  అంబేద్కర్ వాదాన్ని  కొన్ని పార్టీలు అర్థం  చేసుకోలేకపోతున్నాయని  అన్నారు మోడీ. రెండు రోజుల క్రితం దేశంలో ఎమర్జెన్సీకి 43 ఏళ్లు పూర్తి అయ్యాయన్నారు. ఎమర్జెన్సీ పెట్టినవాళ్లు, దాన్ని వ్యతిరేకించినవాళ్లు ఇప్పుడు అధికారం కోసం దురాశతో ఒక్కటయ్యారన్నారు. వాళ్లు సమాజంలోని సంక్షేమాన్ని పట్టించుకోరని, సొంత సంక్షేమం, కుటుంబ సంక్షేమమే వాళ్లకి ముఖ్యమన్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పధకం ద్వారా 5 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని మోడీ తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా 80 లక్షల మంది మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ లు వచ్చాయన్నారు. స్వచ్చ భారత్ అభియాన్ స్కీమ్ ద్వారా 1.25 కోట్ల టాయిలెట్ల నిర్మానం జరిగిందన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates