దేశంలోనే ఫస్ట్ టైం : ఫ్రెంచ్ షోతో ఆకట్టుకున్న విన్యాసాలు

frenchఫ్రాన్స్ కు చెందిన కళాకారుల ప్రదర్శనతో మంగళవారం (ఫిబ్రవరి-13)  హైదరాబాద్ పీపుల్స్ ఫ్లాజా హోరెత్తింది. అట్రాక్టివ్ డ్యాన్సులు, సర్కస్ విన్యాసాలతో ఆబ్బురపరిచారు. రెండు గంటల పాటు జరిగిన ఫ్రెంచ్ ఏరియల్ షో ప్రేక్షకుల్ని ఆనందంలో ముంచెత్తింది. కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గంటసేపు గాలిలోనే.. ఫ్రెంచ్ మ్యూజిక్ వాయిస్తూ డిఫరెంట్ లైటింగ్ మధ్య చేసిన ప్రదర్శనలు అట్రాక్ట్ చేశాయి.  దేశంలోనే తొలిసారి రాజధాని వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్‌ ఏరియల్‌ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్‌ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్‌ ఇండియా కల్చరల్‌’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్‌ ఏరియల్‌ షో తొలి ప్రదర్శనను నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో మంగళవారం రాత్రి నిర్వహించారు.

లైటింగ్, సర్కస్ ఫీట్స్, డ్యాన్స్ లు, మ్యూజిక్ నైట్ ప్రోగ్రామ్స్ కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. కల్చర్ ఎక్సేంజ్ లో భాగంగా ఇలాంటి షోలు బాగా ఉపయోగపడుతాయన్నారు మంత్రి చందూలాల్.

Posted in Uncategorized

Latest Updates