దేశంలోనే ఫస్ట్ : రాష్ట్రంలో 40 డయాలసిస్ కేంద్రాలు

22NGKLO4దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం (ఫిబ్రవరి-22) నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్, ఐసీయూ కేంద్రాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కార్పొరేట్ దవాఖానలను తలదన్నే విధంగా ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందించడే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఖరీదైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హయాంలోని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, సిబ్బంది పని తీరు మెరుగైందని తెలిపారు. దవాఖానల్లో ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే పోస్టులను భర్తీ చేయడంతోపాటు సిబ్బందికి వేతనాలు సైతం పెంచనున్నట్లు మంత్రి ప్రకటించారు. సెకండ్ ఏఎన్‌ఎంల వేతనాలూ పెంచేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు మంత్రి లక్ష్మారెడ్డి.

Posted in Uncategorized

Latest Updates