దేశంలోనే మొదటి సారి: ఏసీ బస్టాప్ ను ప్రారంభించిన కేటీఆర్

ac-bus
హైదరాబాద్ నగరాభివృద్ధిపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం(మే-22) శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ దగ్గర జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. దీంతో దేశంలోనే మొదటిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి GHMC అరుదైన ఘనత సాధించింది. దీంతో పాటు శిల్పారామం దగ్గర లగ్జరీ వాష్‌రూం, లూ కేఫ్‌ను కూడా ప్రారంభించారు మంత్రి కేటీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates