దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ లివింగ్ సిటీ : కేటీఆర్

hyderabadఐటీ రంగంలో  తెలంగాణ  ముందుందన్నారు  రాష్ట్ర ఐటీ,  మున్సిపల్ మంత్రి  కేటీఆర్. హైదరాబాద్ హైటెక్ సిటీలో  ఈ-పామ్  డిజిటల్  ఇంజనీరింగ్  సెంటర్ ని ప్రారంభించారు  కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఈ-పామ్ సిస్టమ్స్ సీఈవో, అధ్యక్షుడు అర్కడియ్ డొబ్కిన్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచంలోని  టాప్ 5  ఐటీ కంపెనీలు  హైదరాబాద్ లో  తమ ఆఫీసులను  ప్రారంభించాయని కేటీఆర్  చెప్పారు. దేశంలోనే  హైదరాబాద్ బెస్ట్ లివింగ్  సిటీ అని…. రాష్ట్రంలో  పట్టణీకరణ  వేగంగా జరుగుతుందన్నారు.  ఏ కొత్త టెక్నాలజీ  వచ్చినా ప్రజలకు ఉపయోగపడేలా  ఉండాలని చెప్పారు . త్వరలో  వరల్డ్  లార్జెస్ట్  స్టార్టప్  ఇంక్యుబేటర్ … టీ హబ్  ఫేజ్ 2 ని ప్రారంభించబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates