దేశంలో ఇలాంటి రైతుపక్షపాతి సీఎంను చూడలేదు : LIC చైర్మన్

vksharmaLICతెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన రైతుబంధు అని కొనియాడారు ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ. రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరిన సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడుతూ ఇవాళ ఎల్‌ఐసీకి చాలా మంచి దినం, రైతుల కోసం ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. రైతుకు జీవిత బీమా చాలా గొప్ప కార్యక్రమం అని ప్రశంసించారు ఆయన. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న లీడర్… రైతుల కోసం ఎంతో కష్టపడుతున్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేశాను. ఎక్కడా రైతు జీవిత బీమా లాంటి పథకాలను చూడలేదు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎల్‌ఐసీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తాం. రైతు జీవిత బీమా పరిహారం ఇచ్చేందుకు పది రోజులకు మించి సమయం తీసుకోబోమని హామీ ఇస్తున్నామన్నారు వీకే శర్మ.

Posted in Uncategorized

Latest Updates