దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌: సీఎం కేసీఆర్

Telangana-Assembly-KCRఏ రాష్ట్రంతో పోల్చుకున్నా దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ గా ఉందన్నారు సీఎం కేసీఆర్. సెక్రటేరియట్‌లో ప్రస్తుతం ఎక్కడా పైరవీలు లేవన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.  అప్పు తెచ్చిన ప్రతిపైసాను ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల కోసం విజయవంతంగా భూసేకరణ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మూడు షిఫ్టుల్లో 26వేల మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. త్వరలో చాలా జిల్లాలకు గోదావరి నీరు రాబోతోందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.నా కల నెరవేరిందని గర్వంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.

జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ ఆదాయం ఎక్కువన్నారు సీఎం. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆదాయం 224 శాతం పెరిగిందన్నారు. పెంచిన సంపదను ప్రజలకు పంచుతున్నామని.. ఇది ప్రతిపక్షాలకు నచ్చడం లేదన్నారు. తెలంగాణ గ్రోత్‌ అద్భుతంగా ఉందన్నారు. 2013-14 తెలంగాణ జీడీపీ 12.4 శాతమే ఉండేదని, 2017-18 తెలంగాణ జీడీపీ 14.1 శాతంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates