దేశంలో శాశ్వత రాజకీయ నాయకులెవరూ లేరు : కేటీఆర్

ktrప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో బ్యూరోక్రసీలదే కీలక పాత్ర అన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్. అధికార వ్యవస్థ ఉన్నపుడు ప్రజా దర్బార్ ఎందుకున్నారు. హైదరాబాద్ MCHRD లో జరిగిన తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియంతో పాటు సీఎస్ SK జోషి తో కలిసి హాజరయ్యారు కేటీఆర్. దేశంలో శాశ్వత రాజకీయ నాయకులెవరూ లేరన్నారు మంత్రి. ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకుంటేనే ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పారు. ప్రజల మనుసు గెలిస్తేనే మరోసారి గెలుస్తారని తెలిపారు. పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఎవరికైనా టైమ్ పడుతుందన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. విధి నిర్వహణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజాసేవలో ముందుండాలన్నారు డిప్యూటీ సీఎం కడియం. మంచి ఫలితాలు సాధించిన 13 మంది అధికారులకు ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించింది ప్రభుత్వం.

 

Posted in Uncategorized

Latest Updates