దేశం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువ: కేటీఆర్

ktr2017-18లో పారిశ్రామిక వృద్ధి 10.4 శాతం పెరిగిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ పార్క్ హోటల్‌లో 2017-18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఉత్తమ కంపెనీలకు పారిశ్రామిక అవార్డులను కేటీఆర్ అందజేశారు. పలు కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

ఇప్పటి వరకు టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. 5 లక్షల 27వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌తో దేశంలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,75,534 అని… ఇది దేశ తలసరి ఆదాయం కంటే 55 శాతం ఎక్కువని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates