దేశం నివ్వెరపోయింది : బాలికపై స్కూల్ మొత్తం అత్యాచారం

biప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా బాలికలపై అఘూయిత్యాలు ఆగటం లేదు. రోజురోజుకీ బాలికలను రేప్ చేస్తున్న వారి సంఖ్యను ప్రభుత్వ చట్టాలు ఆపలేకపోతున్నాయి. ఓ పదమూడేళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా 18 మంది కలసి ఏడు నెలల పాటు అత్యాచారం చేశారు. అత్యంత దారుణమైన ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని చాప్రా జిల్లాలో జరిగింది. అయితే బాలికను రేప్ చేసిన వారిలో స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు కూడా ఉండటంతో దేశం మొత్తం నివ్వెరపోయింది.

2017, డిసెంబర్ లో తన తండ్రి జైలుకు వెళ్లినప్పటి నుంచి.. ఏడు నెలలుగా తను చదివే స్కూల్ ప్రిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు, 15 మంది తోటి విద్యార్ధులు తనను బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని బాలిక చాప్రా జిల్లాలోని పర్సఘర్ లోని ఎక్మా ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేసింది. తన తండ్రి జైలు నుంచి తిరిగి వచ్చేంత వరకూ తనను బెదిరించి అత్యాచారం చేశారని తెలిపింది. మెదట డిసెంబర్ లో తోటి విద్యార్ధి తనను రేప్ చేశాడని.. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు, 15 మంది స్కూల్ విద్యార్ధులు తనను భయపెట్టి అనేక సార్లు అత్యాచారం చేశారని బాలిక తన కంప్లెయింట్ లో తెలిపింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం(జులై-6) స్కూల్ ప్రిన్సిపల్‌, ఓ ఉపాధ్యాయుడిని, ఇద్దరు విద్యార్ధులను అరెస్ట్‌ చేశారు. మిగిలిన 14 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. 13 ఏళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా 18 మంది రేప్ చేయడం, అందులో ప్రిన్సిపల్, టీచర్లు ఉండటంతో  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి స్ధానంలో ఉండాల్సిన టీచర్లు కూడా ఇలా చేయడం చూసి షాక్ అవుతున్నామని.. స్కూళ్లల్లో బాలికలకు రక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులందరినీ ఉరి తీయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates