దేశం మెచ్చిన అందం : మిస్ ఇండియాగా అనుకృతి

anu
మిస్ ఇండియా పోటీలు ఆర్భాటంగా, అద్భుతంగా జరిగాయి. జూన్ 19వ తేదీ మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలు కళ్లు చెదిరాయి. అతిరథ బాలీవుడ్ మహారథులు హాజరైన ఈ వేడుకలో.. 30 మంది అమ్మాయిలు కిరీటం కోసం పోటీ పడ్డారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక అయిన వారి నుంచి తమిళనాడుకి చెందిన 19 ఏళ్ల స్టూడెంట్ అనుకృతి వాస్ మిస్ ఇండియాగా ఎంపిక అయ్యింది. ఈ అమ్మాయే మిస్ వరల్డ్ పోటీల్లోనూ భారత్ తరపున పాల్గొనబోతున్నది. మొదటి రన్నరప్ గా హర్యానాకి చెందిన మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యింది. సెకండ్ రన్నరప్ గా ఆంధ్రాకి చెందిన శ్రేయారావు సెలక్ట్ అయ్యింది.

మిస్ ఇండియా జడ్జీలుగా.. బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, హీరోలు బాబీ డియోల్, కునాల్ కుపూర్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ గుప్తా, క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, కె.ఎల్.రాహుల్ వ్యవహరించారు. హోస్ట్ గా కరణ్ జోహార్ తోపాటు సింగర్ ఖురానా అలరించారు. మిస్ వరల్డ్ అయిన మానుషి చిల్లర్.. మిస్ ఇండియా కిరీటాన్ని అనుకృతికి అలంకరించారు. అనుకృతి వాస్ ది తమిళనాడు రాష్ట్రం. ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది.

 

Posted in Uncategorized

Latest Updates