దేశానికి కేసీఆర్ అవసరం : ఆర్.నారాయణమూర్తి

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రగతి భవన్ కు వచ్చిన కేసీఆర్ ను రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించారు. ప్రగతి భవన్ లో సీఎంను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రముఖులు అభినందించారు.  ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలసి శుభాకాంక్షలు తెలిపారు నటుడు, దర్శకుడు ఆర్‌‌‌.నారాయణమూర్తి.

నాలుగున్నరేళ్ళ కేసీఆర్ పాలన చూసిన ప్రజలు.. టీఆర్ఎస్ కు 88 సీట్లతో గెలిపించారని అన్నారు నారాయణ మూర్తి. ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందన్నారు. ప్రజలకు అమోఘమైన పాలన అందించాలని కేసీఆర్ ను కోరానన్నారు. తెలంగాణను భారతదేశంలో నంబర్ వన్ చేయాలని కోరానని చెప్పారు. “దేశంలో ఉత్తర భారతం పెత్తనం పెరిగింది. భారతదేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ సేవలు అవసరం. భారత పౌరుడిగా కేసీఆర్… ఏపీ సహా.. ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. కేసీఆర్ ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు. చంద్రబాబు కేసీఆర్ లు మంచి మిత్రులు” అని ఆర్‌. నారాయణమూర్తి చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates