దేశాన్నేదాటేసింది : జాగింగ్ చేసుకుంటూ అమెరికా వెళ్లిపోయింది

sedసాధారంగా జాగింగ్ చేస్తూ పక్క ఊరి సరిహద్దుల్లోకి వెళ్లడమో, లేక వేరే ఏరియాల్లోకి వెళ్లడమో మనం ఇప్పటిదాకా చూశాం. అయితే జాగింగ్ కు వెళ్లిన ఓ యువతి ఏకంగా దేశాన్నే దాటేసింది. మే-21 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్రాన్స్‌ కు చెందిన సెడెల్లా రోమన్‌(19) అనే యువతి కెనడాలోని వైట్‌రాక్‌ లో ఉంటున్న తన తల్లిని కలుసుకునేందుకు కెనడా వెళ్లింది. సెడెల్లాకు ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామంలో భాగంగా జాగింగ్ కు వెళ్లే అలవాటు ఉంది. అందులో భాగంగానే జూన్-21 న జాగింగ్ చేస్తూ పొరపాటున  అమెరికా-కెనడా సరిహద్దు దాటేసింది. దీంతో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిందని సెడెల్లాను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాగింగ్‌ చేసుకుంటూ వెళ్తున్న తనను ఇద్దరు యూఎస్‌ సరిహద్దు పోలీసులు ఆపారని, ఆ రోజు రాత్రి టకోమా నార్త్‌ వెస్ట్‌ లోని వలసదారుల నిర్బంధ కేంద్రానికి తనను తరలించారు సెడెల్లా తెలిపారు. విషయం తెలియడంతో రెండు రోజుల తర్వాత నిర్బంధ కేంద్రానికి వచ్చి సెడెల్లా పాస్‌ పోర్ట్‌, ఇతర డీటెయిల్స్ ను యూఎస్‌ అధికారులకు సమర్పించింది ఆమె తల్లి. చివరకు నిర్భందం నుండి సెడెల్లా బయటపడింది. అయితే ఇకపై అమెరికాలో పర్యటించకుండా సెడెల్లా రోమన్‌ పై  యూఎస్ నిషేధం విధించింది.

 

Posted in Uncategorized

Latest Updates