దేశ ప్రతిష్ఠ దిగజారుతోంది : అవినీతిలో భారత్‌ @ 81

IND 81దేశ ప్రతిష్ఠ రోజు రోజుకి దిగజారుతోంది. 2016 తో పోలిస్తే సంవత్సరంలోనే అవినీతి స్థాయి మరింత పెరిగింది.  భారత్‌లో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని లేటెస్ట్ గా ఓ నివేదిక వెల్లడించింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం ఆయా దేశాల్లో గతేడాది జరిగిన సంఘటనలను పరిగణనలోనికి తీసుకున్న సంస్థ.. ప్రపంచ అవినీతి సూచీ–2017 పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అవినీతి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అత్యంత తీవ్రమైన నేరాలు జరుగుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఈ నివేదిక తెలిపింది.  2016 అవినీతి సూచీలో 79వ ర్యాంకు పొందిన భారత్‌ మరో రెండు స్థానాలు దిగజారి 81వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అవినీతి అత్యంత ఎక్కువగా, పత్రికా స్వేచ్ఛ అత్యంత తక్కువగా ఉన్న దేశాలు ఫిలిప్పీన్స్, ఇండియా, మాల్దీవులని నివేదిక వెల్లడించింది. జర్నలిస్టుల, సామాజిక కార్యకర్తల హత్యలను ఇందుకు కారణంగా చూపింది.

భారత్‌కు 40 మార్కులు
అవినీతి, పత్రికా స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ప్రతి దేశానికీ 0 నుంచి 100 మధ్య మార్కులు కేటాయించింది. అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్‌ (89 మార్కులు–మొదటి ర్యాంకు), డెన్మార్క్‌ (88 మార్కులు–రెండో ర్యాంకు)లు నిలిచాయి. భారత్‌కు వందకు 40 మార్కులు వచ్చాయి. సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియాలు వరుసగా 9, 12, 14 మార్కులతో చివరి మూడు స్థానాలకు పరిమితమయ్యాయి.

 

Posted in Uncategorized

Latest Updates